Home
National
Here Are Some Interesting Facts About Bhupendra Patel Who Is Set To Be The New Cm Of Gujarat
Bhupendra Patel | తొలిసారి ఎమ్మెల్యే.. అప్పుడే సీఎం కుర్చీ.. ఎవరీ భూపేంద్ర పటేల్?
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ( Bhupendra Patel ) పేరును ప్రకటించింది బీజేపీ. విజయ్ రూపానీ రాజీనామానే ఆశ్చర్యానికి గురి చేయగా.. కొత్త సీఎంగా భూపేంద్రను ప్రకటించడం మరింత ఆశ్చర్యపరిచింది.

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ( Bhupendra Patel ) పేరును ప్రకటించింది బీజేపీ. విజయ్ రూపానీ రాజీనామానే ఆశ్చర్యానికి గురి చేయగా.. కొత్త సీఎంగా భూపేంద్రను ప్రకటించడం మరింత ఆశ్చర్యపరిచింది. సోమవారమే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ భూపేంద్ర పటేల్ అన్నది ఒకసారి చూద్దాం.
- భూపేంద్ర పటేల్ తొలిసారి 2017లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఘట్లోడియా ఈయన నియోజకవర్గం. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై లక్ష ఓట్లకుపైగా మెజార్టీతో ఈయన గెలిచారు. మాజీ సీఎం, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు విశ్వాసపాత్రుడని భూపేంద్రకు పేరుంది.
- గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్‌గా పని చేశారు. అందావద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి కూడా నేతృత్వం వహించారు.
- అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పొందారు. 2017 ఎన్నికల్లో తనకు రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
- గుజరాత్లో బలమైన పటీదార్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో ఈ కమ్యూనిటీ ఓట్లే లక్ష్యంగా బీజేపీ ఇప్పుడు భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది.
- నిజానికి ముఖ్యమంత్రి రేసులో భూపేంద్ర పేరు లేనే లేదు. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా ఆయన పేరు ప్రకటించింది బీజేపీ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

