Hemant Soren | జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భార్య..? బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ బాధ్యతలను భార్య కల్పనకు అప్పజెప్పే అవకాశం ఉందన్నారు.
Hemant Soren | రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ బాధ్యతలను భార్య కల్పనకు అప్పజెప్పే అవకాశం ఉందన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఎమ్మెల్యే రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో దూబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. సర్ఫరాజ్ తరహాలోనే హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
హేమంత్ సోరెన్‌పై ఈడీ ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోరెన్‌ను ఈడీ ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే సీఎం పదవి నుంచి తప్పుకొని, భార్య కల్పనకు ఆ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. అంటే ఎన్నికలు ఆరేడు నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సర్ఫరాజ్ రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. సోరెన్ రాజీనామా చేస్తే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా..? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో జార్ఖండ్ గవర్నర్ న్యాయ సలహా తీసుకునే అవసరం ఉందని దూబే తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ చివరిసారిగా 2019, డిసెంబర్ 27న ఏర్పాటైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

