Kalpana Soren: ఇవాళ 18వ పెళ్లి రోజు.. హేమంత్ సోరెన్ భార్య ట్వీట్
Kalpana Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ 18వ పెళ్లి రోజు అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున జేఎంఎం నేత తనతో లేరని ఆ పోస్టులో కల్పన పేర్కొన్నారు.
రాంచీ: హేమంత్, కల్పనా సోరెన్ దంపతులకు ఇవాళ పెళ్లి రోజు. వాళ్లు వివాహం చేసుకుని నేటితో 18 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కల్పనా సోరెన్(Kalpana Soren) .. తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున జేఎంఎం నేత తనతో లేరని ఆ పోస్టులో కల్పన పేర్కొన్నారు. కుట్రలను చేధించి ఆయన త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ ఐడెంటిటీని రక్షించాలన్న ఉద్దేశంతో హేమంత్ తలొగ్గలేదని కల్పన తన ట్వీట్లో తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన అంకితం అయినట్లు ఆమె చెప్పారు. ఇవాళ తమ 18వ వెడ్డింగ్ రోజు అని, కానీ హేమంత్ తమ కుటుంబంతో లేరని, పిల్లలతో గడపడం లేదని ఆమె అన్నారు. గుండెధైర్యం కలిగిన జార్ఖండ్ యోధుడి జీవిత భాగస్వామిని అని, ఇవాళ తానేమీ ఎమోషనల్‌గా ఫీలవ్వడం లేదని, హేమంత్ తరహాలోనే కష్టసమయాల్లో చిరునవ్వు ఇస్తానని, ఆయనకు బలంగా మారుతానని కల్పన సోరెన్ తెలిపారు.
झारखण्ड के अस्तित्व और अस्मिता की रक्षा के लिए हेमन्त जी ने झुकना स्वीकार नहीं किया। उन्होंने षड्यंत्र से लड़ना और उसे हराने के लिए अपने आप को समर्पित करना बेहतर समझा।
आज हमारी शादी की 18वीं सालगिरह है, पर हेमन्त जी परिवार के बीच नहीं हैं। बच्चों के साथ नहीं हैं। विश्वास है वो… pic.twitter.com/aBnXEugVkB
— Hemant Soren (@HemantSorenJMM) February 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

