Leh Snow: లేహ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న మంచు.. చిక్కుకున్న వందలాది మంది పర్యాటకులు
Leh Snow: లేహ్‌లో రెండు రోజులుగా మంచు కురుస్తోంది. రోడ్లన్నీ మంచుతో నిండికుపోయాయి. దీంతో వందలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. లడాఖ్ పోలీసులు ఆ పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
లేహ్: లడాఖ్‌లోని లేహ్‌లో భారీగా హిమపాతం(Leh Snow) కురిసింది. దీంతో అక్కడ వందల సంఖ్యలో టూరిస్టులు చిక్కుకుపోయారు. లేహ్‌లోని చాంగ్లా యాక్సిస్ వద్ద చిక్కుకున్న పర్యాటకుల్ని భద్రతా దళాలు రక్షించాయి. శుక్రవారం సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ సంఖ్యలో టూరిస్టులు రావడంతో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
లడాఖ్ పోలీసు శాఖకు చెందిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, గ్రీఫ్ రెస్క్యూ బృందాలు కూడా యాక్టివ్‌గా ఉన్నాయి. అన్ని దళాలు ఒక్కటిగా పనిచేయడంతో.. చాంగ్లా యాక్సిస్ వద్ద ఉన్న పర్యాటకుల్ని లేహ్‌కు సురక్షితంగా తరలించారు.
గత రెండు రోజుల నుంచి భీకరంగా మంచు కురుస్తోంది. దీంతో అక్కడ పర్యాటకుల పరిస్థితి దయనీయంగా మారింది. మంచుగడ్డలు పేరుకుపోవడంతో జారిపడుతున్నారు. రోడ్లు కూడా స్లిప్పరీగా మారాయి. చాంగ్లా టాప్ వద్ద అనేక వాహనాలు నిలిచిపోయాయి. ట్యాక్సీలు, ప్రైవేటు కార్లు కదలలేని స్థితిలో ఉండిపోయాయి. వెదర్‌ను దృష్టిలో పెట్టుకుని పర్యాటకుల తమ టూర్‌ను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
District Police, Leh rescues stranded passengers from Changla Axis amid heavy snowfall.
Prompt action by police, army& GREF rescue teams ensures safe evacuation of women, children& tourists.
Stay safe & follow weather advisories. #LehRescue #SafetyFirst @lg_ladakh @LehPolice pic.twitter.com/uOnOvwIALt
— DGP Ladakh (@DGP_Ladakh) May 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

