PM Modi | మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు : ప్రధాని మోదీ
PM Modi | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. మహాయుతి కూటమికి ఆయన అభినందనలు తెలిపారు.
PM Modi : మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. మహాయుతి కూటమికి ఆయన అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్ని విజయ తీరాలను చేరాలని ఆయన ఆకాంక్ష వెలిబుచ్చారు.
ఇది అభివృద్ధి విజయమని, సుపరిపాలన సాధించిన గెలుపని, సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతామని ప్రధాని మోదీ అన్నారు. మాకు ఇంతటి చారిత్రక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడుతామని బీజేపీ హామీ ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కూటమి 220కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కేవలం 50 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు ఐదు స్థానాల్లో గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

