న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కృత్రిమ చక్కెరలను తీసుకుంటే హృద్రోగ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. కూల్‌డ్రింక్స్‌లో వాడే ఆస్పర్టేమ్, ఏస్‌సల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్ వంటి కృత్రిమ చక్కెరలు (ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) రుచి అందిస్తాయని, అయితే క్యాలరీ పరిమాణం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధన వివరాలు బీఎంజే అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన 18 ఏండ్లు దాటిన వలంటీర్లపై 2009 నుంచి ఈ పరిశోధనలు జరిపారు.