విస్తరణకు ముందు హైడ్రామా.. ఆరోగ్యశాఖ మంత్రి కూడా రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. కాసేపటిక్రితం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ రాజీనామా చేశారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆరోగ్యశాఖ విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి. ఏప్రిల్-మే నెలలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారతీయ ఆరోగ్య వ్యవస్థపై పెను భారం పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. వేలాది మంది బెడ్లు, ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి హర్షవర్దన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో ఇంకా పలువురు మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వర్, సహాయ మంత్రులు రావ్ సాహెబ్ ధాన్వే పాటిల్, విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ దోత్రేలు ఉన్నారు. బాబుల్ సుప్రియో కూడా రాజీనామా చేశారు. మొత్తం రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య 11కు చేరుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

