Padmarajan | 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి!.. విక్రమార్కుడిని మించిపోన పద్మరాజన్
ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించిపోయాడు.
Padmarajan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, 28 మార్చ్ (నమస్తే తెలంగాణ): ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కే పద్మరాజన్ 1988లో మొదటిసారి మెట్టూరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ప్రపంచంలోనే ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్టులో కూడా నమోదైంది. టైర్ పంచర్ షాప్ నడిపిస్తూ జీవనం సాగించే 65 ఏండ్ల కే పద్మరాజన్ ఈసారి తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఘనుడు పద్మరాజన్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
Pyre | ఆస్కార్ రేసులో మరో భారతీయ చిత్రం.. ఇండిపెండెంట్ రూట్లో ప్రయాణిస్తున్న ‘పైర్’!
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

