HD Kumaraswamy | 2028 లోపు మళ్లీ కర్ణాటకకు ముఖ్యమంత్రిని అవుతా : హెచ్డీ కుమారస్వామి
HD Kumaraswamy | భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు.
HD Kumaraswamy : భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలవల్ల ప్రభుత్వం పతనమవుతదని ఆయన జోస్యం చెప్పారు.
ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని, వారు తనకు మరో అవకాశం ఇస్తారని నమ్ముతున్నానని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. 2028లోపు ప్రజల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టి, మరింత అద్భుతంగా పని చేస్తానని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక సీఎంగా తాను చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలే సర్కారును పడగొడతారని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ నేతల్లో పెరిగిపోతున్న అసంతృప్తి పార్టీకి నష్టం చేస్తుందని, త్వరలోనే ఆ విభేదాలు బయటకు వస్తాయని అన్నారు.
అప్పటి వరకు తాను వేచి చూడాల్సిందేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు. కాగా 2006 – 2007, 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు సంకీర్ణ సర్కారుకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

