నీట మునిగిన రోడ్డులో స్కూల్ బస్సు నుంచి పొగలు… విద్యార్థులను రక్షించిన స్థానికులు
పొగలు చూసి స్కూల్ బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కేకలు వేసి స్థానికులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు పరుగున ఆ స్కూల్ బస్సు వద్దకు వచ్చారు.
చండీగఢ్: నీట మునిగిన రోడ్డులో నిలిచిన స్కూల్ బస్సు నుంచి పొగలు వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. డ్రైవర్ కేకలు వేయడంతో స్కూల్ బస్సులోని పిల్లలను స్థానికులు రక్షించారు. హర్యానాలోని సిర్సా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫతేహాబాద్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. ధర్మశాల రోడ్డు మోకాలు లోతు నీటిలో మునిగింది. అయితే శనివారం మధ్యాహ్నం ఒక స్కూల్ బస్సు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్నది. నీట మునిగిన ఆ రోడ్డులో ఆ స్కూల్ బస్సు నిలిచిపోయింది. అనంతరం ఉన్నట్టుండి స్కూల్ బస్సు కింద నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులోని విద్యార్థులు భయాందోళన చెందారు.
మరోవైపు పొగలు చూసి స్కూల్ బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కేకలు వేసి స్థానికులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు పరుగున ఆ స్కూల్ బస్సు వద్దకు వచ్చారు. రోడ్డు నీట మునగడంతో అందులోని విద్యార్థులను బస్సు కిటికీల నుంచి బయటకు తీసి రక్షించారు. వారిని ఎత్తుకుని రోడ్డు దాటించారు.
కాగా, నీట మునిగిన ఆ రోడ్డు మీదుగా స్కూల్ బస్సు వెళ్లడంతో నీళ్లు ఇంజిన్లోకి వెళ్లాయి. దీంతో వేడిగా ఉన్న ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది చూసి బస్సులోని విద్యార్థులతోపాటు స్థానికులు కంగారు పడ్డారు. హుటాహుటిన స్కూల్ పిల్లలను బస్సు నుంచి బయటకు తీసి కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

