Haryana Elections | హర్యానాలో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయ్.. ఫలితాలను అంగీకరించబోం : కాంగ్రెస్
Haryana Elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.
Haryana Elections : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే గంటలోపే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 10 గంటల కల్లా బీజేపీ అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చేయడం, ఆ తర్వాత తుది ఫలితాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడం జరిగిపోయాయి.
దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని వారు తేల్చిచెప్పారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ప్రజల అభీష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని ఆరోపించారు. మధ్యాహ్నం వరకు తాను ఈసీతో టచ్లో ఉంటూ మూడు జిల్లాల్లోని ఈవీఎంలపై ఫిర్యాదు చేసినట్లు జైరామ్ రమేశ్ తెలిపారు.
హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి పరిస్థితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారుమారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమేనని విమర్శించారు. ఉదయమే ఈసీ వెబ్ సైట్లో ఫలితాల సరళి అప్ డేట్ సరిగా జరగడం లేదంటూ జైరామ్ రమేశ్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం అని పేర్కొంది. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా హర్యానా ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

