Professor Arrest | ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్..
Professor Arrest | భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హర్యానాలోని సోనీపట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Professor Arrest | భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హర్యానాలోని సోనీపట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలీఖాన్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు సోనీపట్ ఏసీపీ రాయ్ అజీత్ సింగ్ తెలిపారు. యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మీడియా బ్రీపింగ్లో పాల్గొన్న కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను ప్రొఫెసర్ తప్పుపట్టారు. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఇద్దరూ జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదని.. దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారన్నారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్ర స్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలని.. లేకపోతే అది వంచనే అంటూ కామెంట్ చేశారు.
అయితే, ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అదే రోజున తమ ఎదుట హాజరు కావాలని మే 12న మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా నోటీసులు జారీ చేశారు. అయితే, తన వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్ వక్రభాష్యం చెప్పిందని ప్రొఫెసర్ ఆరోపించారు. మహిళా కమిషన్ నా వ్యాఖ్యలను తప్పుడు తప్పుడు ఉద్దేశంతో చదివిందని.. తప్పుగా అర్థం చేసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. తన మాటల్లోని అర్థాన్ని మార్చేందుకు ప్రయత్నించిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారంలో జాతేది గ్రామ సర్పంచ్ వాంగ్మూలాన్ని సైతం పోలీసులు నమోదు చేసి తాజాగా అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై అశోకా యూనివర్సిటీ స్పందించింది. ప్రొఫెసర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. వాటితో యూనివర్సిటీకి సంబంధం లేదని తెలిపింది. భారత సైన్యాన్ని చూసి యూనివర్సిటీతో పాటు అందరూ గర్విస్తున్నారని పేర్కొంది. జాతీయ భద్రత కోసం సైన్యం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టినా అండగా ఉంటామని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

