Kohinoor | కోహినూర్‌ను తిరిగి తెచ్చుకోవడానికి హిలేరియస్ ప్లాన్ చెప్పిన హర్ష్ గోయెంకా
Kohinoor | ఇంగ్లండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితుడైనప్పటి నుంచి నెట్టింట రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీరిలో కొందరు రిషికి, టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాకు
ఇంగ్లండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితుడైనప్పటి నుంచి నెట్టింట రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీరిలో కొందరు రిషికి, టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాకు మధ్య ఉన్న పోలికలను ఉదహరిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరేమో ఇప్పటికైనా మన కోహినూర్ తిరిగి ఇచ్చేయాలని కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ రేసులో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా కూడా చేరారు. కోహినూర్‌ను తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు తన స్నేహితుడు ఒక ప్లాన్ చెప్పాడంటూ ఆయన ఒక పథకాన్ని నెట్టింట పంచుకున్నారు.
‘కోహినూర్‌ను వెనక్కు తెచ్చేందుకు నా స్నేహితుడి ఐడియా.. రిషి సునాక్‌ను భారత్‌కు ఆహ్వానించాలి. తన అత్తమామలను కలిసేందుకు ఆయన బెంగళూరు ట్రాఫిక్‌లో ఉండగా కిడ్నాప్ చేసేయాలి. ఆ తర్వాత రిషి స్థానంలో ఆశిష్ నెహ్రాను ఆ దేశం పంపించాలి. అలా చేసినా ఎవరూ గుర్తు పట్టలేరు. చివరగా కోహినూర్‌ను భారత్‌కు తిరిగిచ్చే బిల్లును పాస్ చేయించాలని నెహ్రాకు చెప్తాం’ ఇదీ హర్ష్ గోయెంకా స్నేహితుడు చెప్పిన ప్లాన్. ఇది చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటాన్నారు.
My friend’s idea to get back #Kohinoor:
1. Invite #RishiSunak to India
2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws
3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it.
4. Nehra will be told to pass the bill to return Kohinoor💎 in 🇮🇳! 😀😀
— Harsh Goenka (@hvgoenka) October 25, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

