మన్సుఖ్ మృతి కేసులో ట్విస్ట్.. నదిలో హార్డ్‌డిస్క్, కారు నంబర్ ప్లేట్

ముంబై: మహరాష్ట్రలోని ముంబైలో సంచలనం రేపిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనం కేసులో మరో ట్విస్ట్ ఆదివారం బయటపడింది. ఆ కారుకు చెందిన మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మరణించగా ఆయన మృతదేహాన్ని బాంద్రా నది నుంచి వెలికితీసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో మున్సుఖ్ హిరేన్ మరణానికి కారణమని అనుమానిస్తున్న సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజేను, ఎన్ఐఏ అధికారులు ఆదివారం బాంద్రా నది వద్దకు తీసుకెళ్లారు. ఆయన సూచనలతో మున్సుఖ్ హిరేన్ మృతదేహం లభించిన చోట నది లోపల గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నదిలో పడి ఉన్న కంప్యూటర్ సీపీయూ, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్, కొన్ని వస్తువులతోపాటు ఒకే నంబర్ ఉన్న రెండు ప్లేట్లను గజ ఈతగాళ్లు వెలికితీశారు.


కీలకమైన ఆధారాలు లభించడంతో ఈ కేసులోని అసలు మిస్టరీ వీడవచ్చని తెలుస్తున్నది. కాగా, ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజే కస్టడీని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇటీవల ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

