ముదిరిన అమెరికా వీసా సంక్షోభం.. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్‌కు వాయిదా
అమెరికా వీసా సంక్షోభం మరింత అధ్వానంగా మారింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా పడడంతో వందలాది భారతీయుల అమెరికా ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి.
- భారత్‌లో చిక్కుకున్న హెచ్-1బీ దరఖాస్తుదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: అమెరికా వీసా సంక్షోభం మరింత అధ్వానంగా మారింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదా పడడంతో వందలాది భారతీయుల అమెరికా ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. అమెరికాలో తమ కుటుంబాలను వదిలి భారత్‌కు వచ్చిన వేలాది మంది భారతీయులు దాదాపు మరో ఏడాదిపాటు తమ ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీ పేరిట హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చికి తొలుత వాయిదా వేసిన భారత్‌లోని అమెరికన్ ఎంబసీలు ఇప్పుడు వచ్చే అక్టోబర్ వరకు వాయిదాను పొడిగించాయి.
హెచ్-1బీ, హెచ్-4 వీసా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వందలాది భారతీయ దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్‌కు వాయిదా పడడంతో అనిశ్చితిలో చిక్కుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్‌కు వాయిదాపడిన కేసులు తమ దృష్టికి వచ్చినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ న్యాయవాదులు అమెరికన్ బజార్‌కు తెలియచేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ విస్తరణ కారణంగా మరింత సమయం పట్టే అవకాశం ఉందని, అందుకే వీసా ఇంటర్వ్యూలను అక్టోబర్ వరకు వాయిదా వేయడం జరిగిందని అమెరికన్ కాన్సులేట్స్ తెలిపాయి.
ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి..
తమ కుటుంబాలను వదిలి వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వందలాది మంది హెచ్-1బీ ఉద్యోగులు తమ ప్రయాణాలు పలుసార్లు రద్దు కావడం, తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వనరుల లభ్యతకు అనుగుణంగా అపాయింట్మెంట్ల మార్పు జరుగుతుంటుందని, ఎటువంటి మార్పులు జరిగినా దరఖాస్తుదారులకు నేరుగా సమాచారం అందచేయడం జరుగుతుందని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికార ప్రతినిధి తెలిపారు.
కాగా, అపాయింట్మెంట్ల వాయిదాపై తక్షణ చట్టపరమైన చర్యలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కంపెనీ నుంచి రిమోట్ వర్క్ లేదా సెలవు కోరడం ఒక్కటే దరఖాస్తుదారులకు ఉన్న మెరుగైన ప్రత్యామ్నాయమని అమెరికాకు చెందిన సోమిరెడ్డి లా గ్రూపు పీఎల్ఎల్సీ అటార్నీ సంగీత ముకుందన్ సూచించారు. ఇంటర్వ్యూల రద్దుపై నేరుగా చట్టపరమైన చర్యలకు దిగడం చాలా క్లిష్టమని, ఉద్యోగం పోవడం లేదా తర్వాతి కాలంలో ఎదురయ్యే వీసా సమస్యలను నివారించడానికి ప్రతి పరిణామానికి సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని ఆమె దరఖాస్తుదారులకు సూచించారు. ఇప్పటికే సెలవు పెట్టి, వీసా స్టాంపింగ్ కోసం భారత్ వెళ్లిన పలువురు భారతీయులు తమ కుటుంబాలను వదిలి ఎంతకాలం భారత్‌లో వేచి ఉండాలో తెలియని అగమ్యగోచర స్థితి నెలకొంది. శాశ్వత నివాసానికి అమెరికా ఇక సురక్షితమేనా అన్న ప్రశ్న కూడా పలువురిలో ఉత్పన్నమవుతున్నది.
అమెరికాలో ఎంతకాలం ఉండాలన్న దానిపై అధికారులదే నిర్ణయం
అమెరికాను సందర్శించే విదేశీయులు ఆ దేశంలో ఎంత కాలం ఉండవచ్చునో నిర్ణయించే అధికారం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్కే ఉంటుందని భారత్‌లోని యూఎస్ ఎంబసీ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో సందర్శకులు ఉండటానికి తుది గడువు వీసా ముగింపు తేదీ కాదని వివరించింది. https://i94. cbp.dhs.gov వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ఐ-94 ‘అడ్మిట్ అంటిల్ డేట్’ను చూసుకోవాలని తెలిపింది. అమెరికాకు వెళ్లేవారిలో అత్యధికులకు ఐ-94 తప్పనిసరి. దీనిలో ఆ దేశంలో ఉండటానికి ఏ తేదీ వరకు అనుమతి ఇస్తారో పేర్కొంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

