Padma Awards : పద్మశ్రీ అందుకున్న గుస్సాడీ కనకరాజు
Padma Awards : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ’పద్మ’ అవార్డులను 2021 సంవత్సరానికి గాను 119 మంది అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో...

హైదరాబాద్ : (Padma Awards) దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ’పద్మ’ అవార్డులను 2021 సంవత్సరానికి గాను 119 మంది అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి గుస్సాడీ కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు.. ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. దాదాపు 55 సంవత్సరాలుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి చూపే వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కనకరాజుతో పాటు ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామి (కళలు), అసవడి ప్రకాశ్రావు (సాహిత్యం, విద్య), నిడదవోలు సుమతి (కళలు) కూడా పద్మశ్రీ అందుకున్నారు. వీరితోపాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వచ్చిన రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ అవార్డును ఆయన మరణానంతరం వారి కుటుంబసభ్యలకు అందజేశారు.
ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూ, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్దే, ఆర్కియాలజీ విభాగంలో ప్రొఫెసర్ బీబీలాల్కు పద్మవిభూషణ్, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్, యూపీకి చెందిన నృపేంద్ర విశ్రాలు పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ తరఫున ఆయన కుమారుడు, అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తరఫున ఆయన సతీమణి డాలీ గొగోయ్, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తరఫున ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ పద్మభూషణ్ తీసుకున్నారు. మొత్తం ఏడుగురు పద్మవిభూషణ్, 10 మంది పద్మభూషణ్, 102 మంది పద్రశ్రీ అందుకున్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

