చనిపోయిన వ్యక్తికి.. కరోనా టీకా రెండో డోసు!

అహ్మదాబాద్: చనిపోయిన వ్యక్తి.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. నమ్మడం లేదా.. ఒక సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు బయటపడింది. గుజరాత్ రాష్ట్రం బనస్కాంతలోని పాలన్పూర్ పట్టణానికి చెందిన ముఖేష్ జోషి మూడు నెలల కిందట కరోనా టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత మరణించాడు. అయితే ఆయన మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. కాగా, జోషి కరోనా టీకా రెండో డోసు తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తికి టీకా రెండో డోసు ఎలా వేశారంటూ నోరెళ్లబెట్టారు. ఈ విషయం కాస్త విస్తృతంగా ప్రచారం అయ్యింది.
దీనిపై స్పందించిన అధికారులు సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. వివరాలను నమోదు చేసినప్పుడు వ్యాక్సిన్ పొందిన వ్యక్తికి బదులుగా మరణించిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఆరోగ్య కార్యకర్త తప్పుగా నమోదు చేసినట్లు బనస్కాంత ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జిగ్నేష్ హర్యానీ తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న వెంటనే జోషి చనిపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు.
రెండవ డోసు తీసుకోవాల్సిన వ్యక్తుల జాబితా నుంచి జోషి పేరును తొలగించలేదన్నారు. దీంతో రెండో డోసు స్లాట్‌లో పేరు కనిపించడంతో ఆపరేటర్ పొరపాటున ఆయన మొబైల్ నంబర్‌ను రెండో డోసు తీసుకున్న వారి జాబితాలో ఎంటర్ చేశారని చెప్పారు. ఈ పొరపాటు చేసిన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు జిగ్నేష్ హర్యానీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

