Gujarat High Court | న్యూడ్ ఫొటో అప్లోడ్ చేసినందుకు ఈ-మెయిల్ ఖాతా బ్లాక్.. గూగుల్‌కు హైకోర్టు నోటీస్
Gujarat High court | చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేసినందుకు ఓ వ్యక్తి ఈ-మెయిల్ ఖాతాను గూగుల్ బ్లాక్ చేసింది. దీనిపై ఆ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు గూగుల్‌కు నోటీసులు జారీచేసింది. చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేయడంలో తప్పేముందని, అందుకు అతని ఈ-మెయిల్ ఖాతాను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ నోటీసులలో ప్రశ్నించింది.
Gujarat High Court : చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేసినందుకు ఓ వ్యక్తి ఈ-మెయిల్ ఖాతాను గూగుల్ బ్లాక్ చేసింది. దీనిపై ఆ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు గూగుల్‌కు నోటీసులు జారీచేసింది. చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేయడంలో తప్పేముందని, అందుకు అతని ఈ-మెయిల్ ఖాతాను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ నోటీసులలో ప్రశ్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన నీలా శుక్లా అనే కంప్యూటర్ ఇంజినీర్ తన చిన్నప్పటి ఫొటోలను గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేశాడు. వాటిలో శుక్లాకు రెండేళ్ల వయసున్నప్పుడు వాళ్ల నానమ్మ అతనికి స్నానం చేయిస్తున్న ఫొటో కూడా ఉంది. దాంతో ‘ఎక్స్ప్లిసిట్ చైల్డ్ అబ్యూజ్’ కింద గూగుల్ 2023 ఏప్రిల్‌లో శుక్లా ఈ-మెయిల్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత తన ఈ-మెయిల్ ఖాతా పునరుద్ధరణ కోసం అతను ఎన్ని గూగుల్‌తో ఎన్ని ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.
దాంతో శుక్లా గుజరాత్ పోలీసులను, ఈ తరహా సమస్యల పరిష్కారానికి దేశంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగానికి కూడా శుక్లా ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా శుక్లా సమస్యను పరిష్కరించలేదు. పైగా ‘వచ్చే ఏప్రిల్ నాటికి మీ ఖాతా నిరుపయోగంగా ఉండి సంవత్సరం పూర్తి కానున్నందున పూర్తిగా రద్దు చేయబోతున్నాం’ అని గూగుల్ నుంచి శుక్లాకు నోటీస్ వచ్చింది. దాంతో ఆయన మార్చి 12న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్లా పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ వైభవి డీ నానావతి ధర్మాసనం.. మార్చి 15న పిటిషన్‌పై వివరణ కోరుతూ గూగుల్‌కు నోటీసులు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

