human sacrifice | గిలెటిన్ వంటి పరికరంతో తలలు నరుక్కుని.. నరబలి ఇచ్చుకున్న దంపతులు
human sacrifice | తమకు తాము నరబలి ఇచ్చుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించారు. దీనికి ముందు హోమం ఏర్పాటు చేశారు. దాని ముందు తలలు నరికే గిలెటిన్ వంటి పరికరాన్ని ఏర్పాటు చేశారు. మొండం నుంచి తలలు తెగిన తర్వాత ఆ హోమంలో అవి పడేలా ఏర్పాటు చేసుకున్నారు.
అహ్మదాబాద్: దంపతులు గిలెటిన్ వంటి పరికరంతో తమ తలలు నరుక్కుని తమకు తాముగా నరబలి (human sacrifice) ఇచ్చుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వింఛియా గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమ పొలంలో అనుమానాస్పదంగా మరణించారు. 38 ఏళ్ల హేముభాయ్ మక్వానా, భార్య అయిన 35 ఏళ్ల హన్సాబెన్ తమకు తాము నరబలి ఇచ్చుకోవాలని నిర్ణయించారు. దీనికి ముందు హోమం ఏర్పాటు చేశారు. దాని ముందు తలలు నరికే గిలెటిన్ వంటి పరికరాన్ని ఏర్పాటు చేశారు. మొండం నుంచి తలలు తెగిన తర్వాత ఆ హోమంలో అవి పడేలా ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సొంతంగా తయారు చేసుకున్న మరణశిక్షకు వినియోగించే గిలెటిన్ వంటి పరికరం ద్వారా తమ తలలు నరుక్కుని నరబలికి పాల్పడ్డారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా మరణించిన దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ తల్లిదండ్రులు, పిల్లలను బంధువులు జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ భార్యాభర్తలు గత ఏడాదిగా పొలం వద్ద ఉన్న గుడిసెలో ఏవో పూజలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

