Bhavina Patel: భవీనాకు భారీ నజరానా ప్రకటించిన గుజరాత్ సీఎం
Bhavina Patel: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి సిల్వర్ మెడల్ గెలిచిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ( Bhavina Patel ) గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

అహ్మదాబాద్: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి సిల్వర్ మెడల్ గెలిచిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ( Bhavina Patel ) గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయానికి బహుమానంగా భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన కింద రూ.3 కోట్లు భవీనా పటేల్‌కు నజరానాగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలోని వాడ్నగర్ భవీనా స్వస్థలం. ఆమె 12 నెలల వయసులోనే పోలియో బారిన పడింది. అయినా ఏమాత్రం కుంగిపోకుండా గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో టేబుల్ టెన్నిస్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటివరకు పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన భవీనా.. ఐదు గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్ సాధించింది. అంతేగాక, ఇప్పుడు తాను ఆడిన తొలి పారాలింపిక్స్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి వెండి పతకం సొంతం చేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

