వడోదర: గుజరాత్‌లోని వడోదరకు చెందిన 11 ఏండ్ల బాలుడు హార్థిక్ రఘువంశీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. వేవ్బోర్డుపై 360 డిగ్రీల కోణంలో నిమిషంలో 22 చుట్లు (భ్రమణాలు) తిరిగి ఈ ఘనత సాధించాడు.
కోచింగ్ లేకుండా 17 రోజుల్లోనే సొంతంగా ప్రాక్టీస్‌చేసి హార్థిక్ ప్రపంచ రికార్డు కొట్టడం విశేషం. 7వ తరగతి చదువుతున్న హార్థిక్ మూడేండ్ల వయస్సు నుంచి వేవ్బోర్డుపై ఫీట్లు చేస్తుండగా.. ఒకసారి గుండ్రంగా తిరిగింది. అప్పుడు భ్రమణాలలో రికార్డు సాధించాలని భావించి ప్రాక్టీస్ చేసినట్టు హార్థిక్ తెలిపాడు.