న్యూఢిల్లీ : 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్ ప్రైవేట్ సంస్థలో పైలట్ గా చేరినట్టు తెలుస్తున్నది.ఈ ఏడాది మార్చిలో ఐఏఎఫ్ నుంచి రిటైరైన 43 ఏండ్ల అభినందన్ గత నెల్లో ఫ్లై91 అనే ప్రైవేట్ విమానయాన సంస్థలో చేరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఆయన పాత్ర లేదా విమానయాన బాధ్యతల గురించి తక్షణ వివరాలు ఏవీ అందుబాటులో లేవు.