Wedding procession | పెండ్లి కొడుకా మజాకా.. 51 ట్రాక్టర్లలో ఊరేగింపుగా పెండ్లి పిల్ల ఇంటికి.. వైరల్ వీడియో
Wedding procession | సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్లోనే, గుర్రం బగ్గీలోనో లేదంటే ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి (లగ్గం మీదకు వెళ్లడానికి ముందు పెండ్లి కొడుకు సేదదీరే ఇల్లు) చేరుకుంటాడు.
బర్మేర్: సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్లోనే, గుర్రం బగ్గీలోనో లేదంటే ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి (లగ్గం మీదకు వెళ్లడానికి ముందు పెండ్లి కొడుకు సేదదీరే ఇల్లు) చేరుకుంటాడు. పెండ్లి ముహూర్తం సమయానికి కాసేపటి ముందు పెండ్లి కూతరు తరఫువాళ్లు బాజాభజంత్రీలతో అక్కడికి వచ్చి పెండ్లి కొడుకును లగ్గం మీదికి తీసుకెళ్తారు. కానీ, రాజస్థాన్‌కు చెందిన ఓ పెండ్లి కొడుకు మాత్రం అందరిలా కాకుండా భిన్నంగా పెండ్లిపిల్ల గ్రామానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇంతకూ ఆ పెండ్లి కొడుకు ఏం చేశాడు అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లలో 150 మందితో తన ఇంటి నుంచి ఊరేగింపుగా పెండ్లి పిల్ల గ్రామానికి చేరుకున్నాడు. ఆ ట్రాక్టర్ల వరుసలో ముందున్న ట్రాక్టర్‌ను పెండ్లి కొడుకే స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. గ్రామంలో బారులు తీరిన ట్రాక్టర్లను చూసి పెండ్లి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. బర్మేర్ జిల్లా అంతటా ఈ ఊరేగింపు చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ జిల్లాలో గుడమల్ గ్రామానికి చెందిన భూస్వామి జెతరామ్ చౌదరి కొడుకు ప్రకాష్ చౌదరికి, రోలీ గ్రామానికి చెందిన మమత అనే యువతికి ఈ నెల 8న వివాహం జరిపంచారు. వధువు గ్రామంలో జరిగిన ఈ వివాహానికి వరుడు, అతని బంధువులు 150 మంది 51 ట్రాక్టర్లలో ఊరేగింపుగా వచ్చారు. రెండు గ్రామాల మధ్య 51 కిలోమీటర్ల పొడవున కొనసాగిన ఈ ట్రాక్టర్ల ఊరేగింపు పలు గ్రామాల్లో చర్చనీయాంశమైంది.
కాగా, ఏకంగా 51 ట్రాక్టర్లలో ఊరేగింపుగా రావడానికి కారణం ఏమిటని పెండ్లి కొడుకు తండ్రి జెతరామ్ను మీడియా ప్రశ్నించగా.. ‘నా తండ్రి, తాత ఒంటెల మీద పెండ్లికి ఊరేగింపుగా వెళ్లారు. నేను ఒక ట్రాక్టర్లో ఊరేగింపుగా వెళ్లాను. ఇప్పుడు పెండ్లి కుమార్తె గ్రామానికి, మా గ్రామానికి మధ్య దూరం 51 కిలోమీటర్లు కావడంతో నా కొడుకును 51 ట్రాక్టర్లలో ఊరేగింపుగా తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చా’ అని చెప్పారు. కాగా, ఈ ట్రాక్టర్ల ఊరేగింపునకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | Rajasthan: A groom arrived with 51 tractors as part of his wedding procession, in Barmer district
The 1 km long wedding procession had over 200 guests and was led by the groom who himself was driving a tractor. pic.twitter.com/tWOYtZkaiD
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

