సెకండ్ వేవ్ తాకిడి : మరో ఉద్దీపన ప్యాకేజ్ కు కసరత్తు

న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ లాక్డౌన్, కర్ఫ్యూలు విధిస్తుండటంతో ఆర్థిక రికవరీకి ఆటంకం లేకుండా మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మహమ్మారి కారణంగా జీవనోపాధి దెబ్బతినే వారందరికీ ఊతమిచ్చేలా ఈ ప్యాకేజ్ కు తుదిరూపు ఇవ్వనున్నారు. గత ఏడాది కరోనా కట్టడికి మార్చి 26 నుంచి మే 17 వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కేంద్ర ప్రభుత్వం పలు ఉపశమన చర్యలతో రూ 20.97 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ను ప్రకటించింది.
ఇక కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటంతో తాజా ప్యాకేజ్ పై ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు ప్యాకేజ్ ను ఎప్పుడు ప్రకటించాలి..ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కసరత్తు సాగిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిక్కీ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, అసోచామ్ ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్ లతో ఇప్పటికే చర్చలు జరిపారు. ఇక కరోనా కట్టడికి ఈసారి దేశవ్యాప్త లాక్డౌన్ ఉండబోదని, అయితే కఠిన నియంత్రణలు అమలవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

