ఛత్తీస్‌గఢ్‌లో కూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు మృతి
Helicopter | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్ వే చివర్లో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ తునాతునకలు అయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారని ఎస్ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.

మృతులను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాత్సవగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని దేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

