గూగుల్ క్రోమ్ సేఫ్ కాదు
నెట్సర్ఫింగ్ అనగానే గూగుల్ క్రోమ్ తప్ప మరోటి లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: నెట్సర్ఫింగ్ అనగానే గూగుల్ క్రోమ్ తప్ప మరోటి లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. కానీ ఆ బ్రౌజర్ అత్యంత అసురక్షితమైనదని తాజా సర్వేలో వెల్లడైంది. అట్లాస్ వీపీఎన్ సరికొత్త నివేదికలో 303 భద్రతా సమస్యలను నివేదించింది. గత జనవరి 1 నుంచి అక్టోబర్ 5 వరకు బైటపడిన లోపాలివి. దీంతో మొత్తంగా క్రోమ్ భద్రతా సమస్యల సంఖ్య 3,159కి చేరింది. బ్రౌజర్లకు సంబంధించి ఇదే అత్యధికం కావడం గమనార్హం. అక్టోబర్ నెల మొదటి 5 రోజుల్లోనే 5 లోపాలు బయటపడ్డాయట.
అయితే వాటి వివరాలను వీపీఎన్ వెల్లడించలేదు. గూగుల్ క్రోమ్ వెర్షన్ 106.0.5249.61. కు అప్‌గ్రేడ్ అయితే ఈ భద్రతా సమస్యల నుంచి విముక్తం కావచ్చని తెలిపింది. భద్రతా సమస్యల్లో గూగుల్ క్రోమ్ తర్వాతి స్థానాన్ని పైర్‌ఫాక్స్ ఆక్రమించింది. సాపేక్షంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సఫారీ కింది స్థానాల్లో ఉన్నాయి. జనం పెద్దగా వాడని ఓపేరా బ్రౌజర్లో మాత్రం భద్రతా లోపాలు అసలే లేవట.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

