రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడితే రూ.5000

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్వోఆర్టీహెచ్) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో సహాయ పడే వ్యక్తికి రూ.5,000 నగదును బహుమతిగా ఇవ్వనున్నది. సమాజంలో ‘మంచి సమారిటన్ల’ను ప్రొత్సహించేందుకు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో సాధారణ ప్రజలను చైతన్య పరచడానికి ఈ పథకాన్ని లాంచ్ చేసినట్లు ఎమ్వోఆర్టీహెచ్ తెలిపింది. ప్రతి గుడ్ సమారిటన్కు రూ.5,000 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తామని పేర్కొంది.
దీనితో పాటు ప్రతి ఏటా వీరిలో పది మందిని ఎంపిక చేసి లక్ష నగదు చొప్పున జాతీయ స్థాయి అవార్డుతో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సత్కరించనున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

