న్యూఢిల్లీ: కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. నిషేధిత ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో కలిసి అతడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. ఉగ్రవాదులు దేశంలో చొరబడటానికి సహకారం అందించడంతోపాటు హత్య కేసుల్లోనూ ప్రమేయం ఉన్నదని హోంశాఖ వెల్లడించింది.