Cigarette | ఇండోర్ : కొంతమంది యువతులు ఓ కేఫ్ వద్ద సిగరెట్లు కాల్చటాన్ని చూసి ఆగ్రహానికి లోనైన 70 ఏండ్ల వృద్ధుడు, రాత్రి కేఫ్‌ను మూసేసాక..అక్కడికి వెళ్లి దానికి నిప్పు పెట్టాడు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువతులు సిగరెట్లు కాల్చడాన్ని సహించలేక.. కేఫ్‌కు నిప్పు పెట్టానని వృద్ధుడు పోలీసులకు తెలిపాడు.