ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ప్రియుడు ఆత్మహత్య
ఇది చూసిన ఆ యువతి షాక్ అయ్యింది. వెంటనే పరుగెత్తుకుని ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. తలుపులు బలంగా కొడుతూ బోరున ఏడ్చింది.
భువనేశ్వర్: ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాజ్‌పూర్ జిల్లా ధామశాలకు చెందిన 23 ఏళ్ల మనోజ్ కుమార్ బెహెరా, కటక్‌లోని శ్రీశ్రీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జిల్లాలోని సంధాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రియురాలైన యువతి కూడా సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు లాప్టాప్లో వీడియో కాల్ ద్వారా యువతితో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆ జంట మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలు వీడియో కాల్లో ఉండగానే డోర్‌ను లాక్ చేశాడు. గదిలోని రూఫ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఇది చూసిన ఆ యువతి షాక్ అయ్యింది. వెంటనే పరుగెత్తుకుని ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. తలుపులు బలంగా కొడుతూ బోరున ఏడ్చింది. గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఉరికి వేలాడుతున్న మనోజ్‌ను వెంటనే ఎస్సీబీ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతడి ప్రియురాలిని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

