Ragging | ఒడిశా కళాశాలలో ర్యాగింగ్.. మైనర్ బాలికకు బలవంతంగా ముద్దులు పెట్టించి..!
Ragging | మన దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉంది. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ కొన్ని కళాశాలల్లో సీనియర్లు జూనియర్ల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలోని ఓ కళాశాలలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కళాశాలలో కొత్తగా చేరిన ఓ అమ్మాయి పట్ల సీనియర్లు మితిమీరి ప్రవర్తించారు.

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ ప్రభుత్వ కళాశాలలో కొత్తగా చేరిన ఓ మైనర్ బాలికను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. అంతటితో ఆగకుండా శారీరకంగా వేధింపులకు గురి చేశారు. ఫ్రెషర్ విద్యార్థితో బాలికకు బలవంతంగా కళాశాల గ్రౌండ్లో అందరి ముందూ ముద్దులు పెట్టించారు. మధ్యలో విద్యార్థిని వెళ్లిపోతుండగా పక్కనే నిల్చొని ఉన్న సీనియర్ విద్యార్థి కర్రతో ఆమెను బెదిరించి ఆపాడు. ఆ సమయంలో పక్కనే మరికొంతమంది విద్యార్థినిలు ఉన్నా ఈ దారుణాన్ని అడ్డుకోకుండా చోద్యం చూస్తుండటం విచారకరం. అక్కడే ఉన్న మరికొంతమంది విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కాస్తా వైరల్ కావడంతో ఘటనపై కళాశాల యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థులకు టీసీ ఇచ్చి కళాశాల నుంచి పంపించేసింది. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై ఒడిశా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇందులో ఓ విద్యార్థి బెయిల్‌పై విడుదలయ్యాడు.
https://www.youtube.com/watch?v=kNzq7RUG4j4
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!