ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్: రైల్వే

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలు మూలల నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డిమాండ్ పెరిగిందని రైల్వే చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 19న వైజాగ్, ముంబై మధ్య తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ డ్రై రన్ తరువాత, 25 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచాయని, 56 ట్యాంకర్లలో 813 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 25 ఆక్సిజన్ ట్యాంకర్లను ఉత్తరప్రదేశ్‌కు, 10 ట్యాంకర్లను మహారాష్ట్రకు, 12 ట్యాంకర్లను మధ్యప్రదేశ్‌కు, ఐదు ట్యాంకర్లను హర్యానాకు, నాలుగు ట్యాంకర్లను ఢిల్లీకి చేరవేసినట్లు వెల్లడించారు. మరి కొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నామని, మరికొన్నింటికి కూడా నడుపుతామన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆక్సిజన్ రవాణాతోపాటు ఐసొలేషన్ బోగీల ఏర్పాటులోనూ రైల్వే ఎంతో సహకరిస్తున్నదని సునీత్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు 64,000 బెడ్స్‌తో కూడిన 4,000 ఐసొలేషన్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1,390 ప్రత్యేక రైళ్లు, 5,387 సబ్ అర్బన్ రైళ్లు ప్రతి రోజు నడుస్తున్నాయని అన్నారు. 794 పాసింజర్ రైళ్లను కూడా నడుపుతున్నామని, మొత్తం మీద 70 శాతం రైళ్లను పునరిద్ధరించినట్లు వివరించారు. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనంగా 370 రైళ్లు నడిపినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

