Uttar Pradesh | ఆస్తికోసం.. మత్తిచ్చి స్నేహితుడిని స్త్రీగా మార్చిన యువకుడు!
స్నేహితుడి ఆస్తి కొట్టేయాలని భావించిన యువకుడు సినీ రచయితల ఊహకు సైతం అందని ప్లాన్ వేశాడు. వైద్యులతో కలిసి కుట్రపన్ని లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువకుడి తండ్రిని చంపేస్తానని బెదిరించి అతడి వాటా ఆస్తిని రాయించుకున్నాడు.
- బాధితుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్ర చికిత్స
- ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం
Uttar Pradesh | లక్నో: స్నేహితుడి ఆస్తి కొట్టేయాలని భావించిన యువకుడు సినీ రచయితల ఊహకు సైతం అందని ప్లాన్ వేశాడు. వైద్యులతో కలిసి కుట్రపన్ని లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువకుడి తండ్రిని చంపేస్తానని బెదిరించి అతడి వాటా ఆస్తిని రాయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. సంజక్ గ్రామానికి చెందిన ముజాహిద్ (20), ఓంప్రకాశ్ స్నేహితులు. రెండేండ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. అనారోగ్యం పేరుతో ఈనెల 3న ముజాహిద్‌ను ఓంప్రకాశ్ దవాఖానకు తీసుకెళ్లాడు. అక్కడ ముజాహిద్‌కు మత్తుమందు (అనెస్థీషియా) ఇచ్చిన వైద్యులు లింగమార్పిడి ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చేశారు. స్పృహ వచ్చాక తాను అమ్మాయిగా మారినట్టు చెప్పడంతో నిర్ఘాంతపోయానని ఓంప్రకాశ్ గుర్తుచేసుకున్నాడు.
మనం పెళ్లి చేసుకుందామని, అందుకోసం లాయర్‌ను, కోర్టును కూడా సిద్ధం చేశానని ముజాహిద్‌తో ఓంప్రకాశ్ చెప్పుకొచ్చాడు. “ఇప్పుడు నీ తండ్రిని కాల్చి చంపి నీ వాటాగా రావాల్సిన భూమిని తీసుకుని నా పేరుపై రాయించుకుంటాను. ఆ తర్వాత దానిని అమ్మేసి లక్నో వెళ్లిపోతాను” అని ఓంప్రకాశ్ తనను బెదిరించినట్టు ముజాహిద్ ఆరోపించాడు. ఘటన వెలుగులోకి రావడంతో మాజీ నేత శ్యాంపాల్ నేతృత్వంలోని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు మెడికల్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఓం ప్రకాశ్‌తోపాటు అతడికి సహకరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక మానవ అవయవాల అక్రమ రవాణా ముఠా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

