లక్నో: జెన్ అల్ఫా విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. బురదమయమైన రోడ్డు దుస్థితిపై ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన కాన్వాయ్‌ను వెళ్లనిచ్చారు. (Students stop MLA convoy) ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హనుమన్గంజ్ ప్రాంతంలోని పలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు స్థానిక కాలువ రోడ్డును విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. అయితే నీరు నిలువడంతో ఆ రోడ్డు బురదమయంగా మారింది. దీంతో నడిచి వెళ్లే విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు తరచుగా జారి బురద నీటిలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి స్కూల్ యూనిఫాంలు, బూట్లు మురికి అవుతున్నాయి.
కాగా, బుధవారం స్కూల్ ముగిసిన తర్వాత విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. స్థానిక సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రాజేంద్ర చౌదరి కాన్వాయ్ అటుగా వెళ్లడాన్ని చూసి వారు అడ్డుకున్నారు. నీరు నిలిచి బురదమయమైన ఆ రోడ్డు దుస్థితిని చూడమని ఆయనను కోరారు. ప్రతిరోజు తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు.
మరోవైపు విద్యార్థుల సమస్యపై ఎమ్మెల్యే రాజేంద్ర చౌదరి సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బురదమయంగా ఉన్న ఆ రోడ్డు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే కాన్వాయ్‌ను విద్యార్థులు ముందుకు వెళ్లనిచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बस्ती
➡Gen Alpha छात्रों ने समस्या से कराया अवगत
➡रास्तों को समस्या को लेकर कराया अवगत
➡नहर की पटरी से जाने वाला रास्ता है खराब
➡छात्रों की समस्या का लिया गया संज्ञान
➡रास्ते की मरम्मत कराने के दिए गए निर्देश
➡जेई ने पहुंचकर रास्ते का किया निरीक्षण@bastipolice @dmbas_… pic.twitter.com/aQAGbMxowf— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 20, 2026