GATE 2023 Exam | ఈ నెల 4 నుంచి గేట్ పరీక్షలు.. అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్..
GATE 2023 Exam | ది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2023 పరీక్షలను ఈసారి ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు.
న్యూఢిల్లీ: ది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2023 పరీక్షలను ఈసారి ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరుగుతుంది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వారి అడ్మిట్ కార్డులతో రావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి. ఈ అడ్మిట్ కార్డులను ఇంతకుమునుపే జనవరి 9వ తేదీని జారీ చేశారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది ప్రక్రియను అనుసరించాలి.
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ఇలా..
1. ముందుగా అధికారిక వెబ్సైట్ gate.iitk.ac.in ను ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలోని నోటిఫికేషన్ సెక్షన్లో ‘GATE 2023 Admit Card’ అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
3. క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. అందులో మీ లాగిన్‌కు సంబంధించిన వివరాలను పొందుపర్చి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
5. ఇలా డౌన్లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులను ప్రింట్‌వుట్ తీసుకోవాలి. అడ్మిట్ కార్డు లేకుండా అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

