Gas Subsidy : గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
Gas Subsidy : గ్యాస్ సిలిండర్ రాయితీ మొత్తం మన అకౌంట్లో జమ అవుతున్నది? లేనిదీ? తెలుసుకునేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వెబ్సైట్ ద్వారా...

గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరుగుతూ సామాన్యుడిపై మరింత భారం మోపుతున్నాయి. కేంద్ర ఇచ్చే రాయితీ డబ్బులైనా అకౌంట్లో పడుతున్నాయా? అంటే అదీ లేదని సామాన్యు గృహిణిలు గొనుక్కోవడం మనం నిత్యం వింటూనే ఉన్నాం. రాయితీ (Gas Subsidy) మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లుగా కేంద్రం ఒకవైపు చెప్తుండగా.. అందట్లేదు మహాప్రభో..! అంటూ ప్రజలు కోపం వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం ఇస్తున్న రాయితీ మొత్తం వినియోగదారుల అకౌంట్లలో జమ కాకుండా ఎక్కడికి పోతున్నాయి? అనే సందేహం సర్వత్రా వెంటాడుతున్నది. గ్యాస్ సిలిండర్ రాయితీ మొత్తం మన అకౌంట్లో జమ అవుతున్నది? లేనిదీ? తెలుసుకునేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వెబ్సైట్ ద్వారా రాయితీ వస్తున్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు.
ఇండేన్ కస్టమర్లు ఇలా..
ఇండేన్ కస్టమర్లు రాయితీ సొమ్మును తెలుసుకునేందుకు www.mylpg.in వెబ్సైట్ లాగిన్ అయి తాము ఏ సంస్థ నుంచి గ్యాస్ పొందుతున్నారో అ సంస్థ సిలిండర్ బొమ్మపై క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో గీవ్ ఫీడ్‌బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఎం సహాయం కావాలని అడుగుతుంది. అప్పుడు సిలిండర్ గుర్తుపై క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజీలో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీనిలో సబ్సిడీ రిలేటెడ్ (పహల్) అనే దానిపై క్లిక్ చేస్తే పక్కన మరో సబ్-క్యాటగిరి సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అనేది కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌నుగానీ, లేదా ఎల్పీజీ ఐడీ నంబర్‌గానీ ఎంటర్ చేయగానే.. మీ రాయితీ సొమ్ము వచ్చిందీ, లేనిదీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఒకవేళ సబ్సిడీ రానిపక్షంలో చివరి బాక్స్‌లో ఉన్న సెలక్ట్‌ను సెలక్ట్ చేసి మన ఫిర్యాదును రాసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఫిర్యాదును స్వీకరించి మీ బ్యాంకు అకౌంట్లో రాయితీ సొమ్ము పడేలా చూస్తారు.
హెచ్‌పీ, భారత్ కస్టమర్లు ఇలా..
సిలిండర్ రాయితీ సొమ్ము తెలుసుకునేందుకు హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు www.mylpg.in పై క్లిక్ చేస్తే సిలిండర్ గుర్తులు వస్తాయి. దానిలో గ్యాస్ పంపిణీ సంస్థ సిలిండర్‌పై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. కొత్త వాళ్లు న్యూ యూజర్ అనేది ఎంచుకుని యూజర్ ఐడీ, పాస్వర్డ్ టైప్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి సైన్ఇన్ అయి.. ఎడమ వైపున ఉండే ‘వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ’ పై క్లిక్ చేయాలి. అప్పుడు మనం సిలిండర్ కోసం ఎంత చెల్లించాం.. మనకు ఎంత సబ్సిడీ వచ్చింది అనే విషయాలు కనిపిస్తాయి. సబ్సిడీ అందనివారు ఫిర్యాదు చేయడం ద్వారా కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
సబ్సిడీ రాకపోవడానికి కారణాలివే..
ఒకవేళ మీకు ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ రావడం లేదంటే పలు కారణాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వాటిలో మొదటిది ఆధార్ లింక చేయకపోవడం. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారికి సబ్సిడీ ఇవ్వరు. రూ.10 లక్షల వార్షిక ఆదాయం భార్యాభర్తల ఇద్దరి ఆదాయంతో కలిపి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కూడా జమ కాకపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే, ఆధార్‌లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ మరే ఇతర బ్యాంకు అకౌంట్‌కు జతైన ఉన్నట్లైతే కూడా మీకు రాయితీ మొత్తం అందదు.
ఇవి కూడా చదవండి..
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

