చండీగఢ్: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్‌ను దారుణంగా హత్య చేశారు. (Lawrence Bishnoi’s Shooter Killed) అతడి కాళ్లు, చేతులు కట్టేసి సజీవంగా దహనం చేశారు. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్ రాజన్ లద్వా హత్యకు గురైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లాలోని యమునా నది ఒడ్డున కాలిన మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. రాజన్ చేతులు, కాళ్లు కట్టేసి తగులబెట్టారని వెల్లడించారు.
కాగా, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్ రాజన్ లద్వా హత్య తమ పనే అని గ్యాంగ్‌స్టర్ డేవిందర్ బంబిహా తెలిపాడు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 2022లో పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, గత ఏడాది డిసెంబర్లో జైపూర్‌లోని ఇంటిలో రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యల నేపథ్యంలో ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు. మరోవైపు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో దగ్గరి సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఈ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.