Ganga Pushkaralu 2023 | నేటి నుంచి మే 3 దాకా గంగా పుష్కరాలు
Ganga Pushkaralu 2023 | పుష్కర కాలానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగకు గంగానది సిద్ధమవుతున్నది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 ఏండ్ల తర్వాత నేటి నుంచి గంగా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.
Ganga Pushkaralu 2023 | హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): పుష్కర కాలానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగకు గంగానది సిద్ధమవుతున్నది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 ఏండ్ల తర్వాత నేటి నుంచి గంగా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్ సంగమం ప్రయాగ నగరాలలో పుష్కరాల సంరంబం ఆరంభమవుతున్నది.
పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తమవుతామని ప్రతీతి. ఈ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారని చెప్తారు. రోజుకు 25 లక్షల దాకా జనం గంగా స్నానం ఆచరిస్తారు. కనీసం కోటి మంది నిత్యం పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటుంటారు. గంగానది పుట్టింది మొదలు సముద్రంలో కలిసే దాకా ప్రతీది భారతీయులకు పవిత్రం. గంగా ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. మరెన్నో సామ్రాజ్యాలు వెలిశాయి. గంగానదికి చాలా పేర్లున్నాయి. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అంటారు. జహ్ను పొట్టంలోంచి పుట్టింది కాబట్టి జాహ్నవిగా కూడా పిలుస్తారు. భారతీయులు ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే గంగా ప్రధానమైనది. కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగాపుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్లు ఉన్నాయి. అన్నింటిలోకి మణికర్ణిక ఘాట్ ముఖ్యమైనది. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పడు అంటే 2023, మే 3న గంగానది పుష్కరాలు ముగుస్తాయి.
18 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి గంగా నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. శనివారం నుంచి మే 3 వరకు కొనసాగే ఈ పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లు నడిచే తేదీలు, సమయం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

