గూగుల్ డూడుల్‌గా ది గ్రేట్ గామా..! ఆయన చరిత్ర ఏంటంటే?
ఈ రోజు (22-05-2022) గూగుల్ డూడుల్ చూశారా? లంగోటి కట్టుకొని చేతిలో గద పట్టుకున్న ఆయన భారతదేశం గర్వించదగ్గ మల్లయోధుడు ది గ్రేట్ గామా అని మీకు తెలుసా? గామా 144వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం చిత్రాన్ని గూగుల్ ఈ రోజు డూడుల్‌గా పెట్టింది.
ఈ రోజు (22-05-2022) గూగుల్ డూడుల్ చూశారా? లంగోటి కట్టుకొని చేతిలో గద పట్టుకున్న ఆయన భారతదేశం గర్వించదగ్గ మల్లయోధుడు ది గ్రేట్ గామా అని మీకు తెలుసా? గామా 144వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం చిత్రాన్ని గూగుల్ ఈ రోజు డూడుల్‌గా పెట్టింది.
ది గ్రేట్ గామా అసలు పేరు గులాం మహమ్మద్ భక్స్ బట్. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయనను రుస్తుం-ఎ-హింద్ అని కూడా పిలుస్తారు. ది గ్రేట్ గామా అనేది ఆయన రింగ్ నేమ్. కాగా, గామా డూడుల్‌ను కళాకారిణి బృందా జవేరి రూపొందించారు. గామా.. రింగ్‌లోనే కాదు..భారతీయ సంస్కృతికి ఆయనొక ఐకాన్.
మల్లయోధుల కుటుంబం నుంచి వచ్చిన గామా.. 10 ఏళ్ల వయస్సులోనే రెజ్లింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. 52 ఏళ్లకుపైగా తన కెరీర్లో అజేయంగా ఉండి.. ప్రపంచంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా నిలిచిపోయారు. ఆయన ప్రతిరోజూ వ్యాయామ దినచర్యలో భాగంగా 500 లంగ్స్, 500 పుషప్స్ చేసేవారు. 1888లో అతను దేశవ్యాప్తంగా ఉన్న 400 మంది మల్లయోధులతో జోధ్‌పూర్‌లో లంగే పోటీలో పాల్గొన్నారు. ఇందులో ఆయనను జోధ్‌పూర్ మహారాజు విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో భారతదేశంలోని రాచరిక రాష్ట్రాల అంతటా కీర్తి పొందారు. ఆ తర్వాత దాటియా మహారాజా శిక్షణ తీసుకున్నారు.
1910 నాటికి గామా నేషనల్ హీరో అయిపోయారు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించారు. భారతీయ వార్తాపత్రికల్లో హెడ్‌లైన్‌గా నిలిచారని గూగుల్ పేర్కొంది. 1947లో భారతదేశ విభజన సమయంలో అనేక మంది హిందువుల ప్రాణాలను కాపాడినందుకు గామాను హీరోగా కూడా పరిగణిస్తారు. ఆయన 1960లో మరణించే వరకు తన మిగిలిన రోజులను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్‌లో భాగమైన లాహోర్‌లో గడిపారు.
గామా తన కెరీర్లో చాలా టైటిళ్లను సాధించారు. ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ (1910), వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ (1927) టోర్నమెంట్ తర్వాత “టైగర్” బిరుదు పొందారు. గొప్ప మల్లయోధుడిని గౌరవించేందుకు భారతదేశ పర్యటన సందర్భంగా వేల్స్ యువరాజు ఆయనకు వెండి గదను కూడా బహుకరించారు. గామా.. స్క్వాట్స్, పుషప్స్ కోసం ఉపయోగించే 100 కిలోల డోనట్ ఆకారపు డిస్క్ (హస్లీ)..పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) మ్యూజియంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

