45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటినవాందరికీ టీకా పంపిణీ చేయనున్నారు. అర్హులైన వారందరూ టీకా కోసం నమోదు చేసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్ర సంఘాల సూచన మేరకు కోవిడ్ టీకా రెండవ డోసును నాలుగు నుంచి 8 వారాల మధ్య తీసుకోవచ్చు అని మంత్రి తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు ఈ నియమం వర్తిస్తుందన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలని అభ్యర్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

