Mamata Banerjee | మమతా బెనర్జీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య
Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. మమతకు అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య టీఎంసీకి రాజీనామా చేశారు.
Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. మమతకు అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య టీఎంసీకి రాజీనామా చేశారు. పార్టీకి చెందిన అన్ని పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఇకపై పార్టీకి పూర్తి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా చేయడం అంటే ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.
టీఎంసీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు, కాలిఘాట్లో మమతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రిమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీఎంసీకి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లకు సంబంధించి బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు, అలాగే, తన సంతకాన్ని కూడా వాటి నుంచి తొలగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇకపై, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఆమె సంతకం చెల్లదు. పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ.. ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే, తన రాజీనామాకు గల కారణాన్ని చంద్రిమ వెల్లడించలేదు. ఉన్నట్లుండి ఆమె తన పదవులకు రాజీనామా చేయడం బెంగాల్ రాజకీయాల్లో్ సంచలనంగా మారింది.
మరోవైపు చంద్రిమ రాజీనామాపై టీఎంసీ కూడా స్పందించలేదు. ఇప్పటికే టీఎంసీకి అనేక మంది కీలక నేతలు రాజీనామా చేశారు. మరోవైపు అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకు అసెంబ్లీలో టీఎంసీ తరఫున ప్రతిపక్ష నేతగా గుర్తింపు దక్కింది. తిరుగుబాటు అంశం ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. మమతా బెనర్జీ వర్గానికి, రితబ్రత వర్గానికి ఈసీ నోటీసులు జారీ చేసింది. వారి స్పందన తర్వాత ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

