Clouds | నల్లటి మేఘాలతో మానవాళికి పొంచిఉన్న ప్రమాదం..
ఆకాశంలో కారు మబ్బులు కమ్మాయంటే భారీ వర్షమో, తుఫానో వస్తుందని అనుకుంటాం. కానీ, ఈ నల్లటి మేఘాలతో మానవాళికి మరో ప్రమాదం ఉన్నదని ఫ్రెంచ్, కెనడా పరిశోధకులు తేల్చారు. ఈ మేఘాలు రోగ నిరోధక వ్యవస్థను తట్టుకొనే బ్యాక్టీరియాను సుదూర ప్రాంతాలకు మోసుకెళ్తున్నట్టు గుర్తించారు.
Clouds | న్యూయార్క్, ఏప్రిల్ 29: ఆకాశంలో కారు మబ్బులు కమ్మాయంటే భారీ వర్షమో, తుఫానో వస్తుందని అనుకుంటాం. కానీ, ఈ నల్లటి మేఘాలతో మానవాళికి మరో ప్రమాదం ఉన్నదని ఫ్రెంచ్, కెనడా పరిశోధకులు తేల్చారు. ఈ మేఘాలు రోగ నిరోధక వ్యవస్థను తట్టుకొనే బ్యాక్టీరియాను సుదూర ప్రాంతాలకు మోసుకెళ్తున్నట్టు గుర్తించారు.
పరిశోధకులు 2019 సెప్టెంబర్-2021 అక్టోబర్ మధ్య ఫ్రాన్స్‌లోని నిద్రాణమైన అగ్నిపర్వతం పుయ్ డి డోమ్ శిఖరంపై సముద్ర మట్టానికి 1,465 మీటర్ల ఎత్తులో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం నుంచి నమూనాలను సేకరించారు. వీటిని విశ్లేషించగా మిల్లీ లీటర్ క్లౌడ్ వాటర్‌కు 330 నుంచి 30 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఉన్నాయని గుర్తించారు. ఇందులో 29 ఉప రకాల డ్రగ్ నిరోధక బ్యాక్టీరియాలున్నట్టు కనుగొన్నామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఫ్లోరెంట్ రోసి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

