Chandipura virus : చాందిపుర వైరస్ సోకి నలుగురు పిల్లలు మృతి..
Chandipura virus : చాందిపుర వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురు పిల్లలు ఆ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో మరో ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హిమత్‌నగర్: గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లాలో చాందిపుర వైరస్ సోకి నలుగురు పిల్లలు మృతిచెందారు. మరో ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హిమత్‌నగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో చిన్నారులకు చికిత్స జరుగుతోంది. చాందిపురా వైరస్ కేసుల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ వైరస్ సోకిన వారికి ఫ్లూ లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్ర స్థాయి ఇన్సెఫలైటిస్ కూడా వస్తుంది. దోమలు, పురుగుల ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఆరుగురు చిన్నారులకు చెందిన రక్తపు నమోనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ శ్యాంపిళ్ల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సబర్కాంత జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు.
జూలై పదో తేదీన నలుగురు చిన్నారులు చాందిపుర వైరస్ సోకి మృతిచెందినట్లు తొలుత హిమ్మత్‌నగర్ ఆస్పత్రి పీడియాట్రిక్ డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే ఆ పిల్లల లక్షణాలే మరో ఇద్దరిలో గమనించినట్లు చెప్పారు. చాందిపుర వైరస్ వల్ల మృతిచెందిన వారిలో ఒకరు సబర్ కాంత్ జిల్లా వాసి కాగా, ఇద్దరు ఆరావలి జిల్లా వాసులున్నారు. నాలుగవ చిన్నారి మాత్రం రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇద్దరు కూడా రాజస్థానీయులే. రక్షణాత్మక చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో రెక్కల పరుగులను చంపనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

