ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రాజేశ్ బిందాల్
నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నియమితులయ్యారు. ఆయన ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నుంచి ఉద్యోగ విరమణ పొందారు.
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ, నవంబర్ 5: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నియమితులయ్యారు. ఆయన ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నుంచి ఉద్యోగ విరమణ పొందారు. ఈ ఏడాది జూలై 1న ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా పదవీకాలం ముగిసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ స్థానంలో జస్టిస్ బిందాల్ నియమితులయ్యారు.
జస్టిస్ బిందాల్ సుప్రీంకోర్టులో మూడేండ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేసిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 15న ఉద్యోగ విరమణ చేశారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన 2023 ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు. హర్యానాలోని అంబాలాలో 1961 ఏప్రిల్ 16న జన్మించిన జస్టిస్ బిందాల్ 1985 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఆయన 2006 మార్చి 22న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాదిగా పదోన్నతి పొందారు. తన న్యాయవాద వృత్తి జీవితంలో ఆయన 2021 అక్టోబర్ 11న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు జమ్ము, కశ్మీరు హైకోర్టు, కలకత్తా హైకోర్టుల్లో కూడా పనిచేశారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్ణయాల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను విచారించడానికి ఎన్సీఎల్ఏటీ ప్రధాన అప్పీలేట్ వేదికగా పనిచేయడంతో పాటు దివాలా, రుణ పరిష్కార చట్టం, 2016, కాంపిటీషన్ యాక్ట్, 2002 కింద ఉన్న విషయాలలో కూడా అప్పీలేట్ అధికార పరిధిని కలిగి ఉన్నందున జస్టిస్ బిందాల్ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతదేశ కార్పొరేట్ వివాద పరిష్కార వ్యవస్థల్లో ముఖ్యంగా దివాలా ప్రక్రియలు, కార్పొరేట్ పునర్నిర్మాణం, విలీనాలు, పోటీ చట్టానికి సంబంధించిన విషయాల్లో ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

