న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో జలక్ తగిలింది. ఆ పార్టీకి విభాకర్ శాస్త్రి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడే విభాకర్ శాస్త్రి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇవాళే బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Hon’ble Congress President Shri @kharge ji!
Respected Sir,
I hereby tender my resignation from the primary membership of Indian National Congress (@INCIndia)
Regards
Vibhakar Shastri— Vibhakar Shastri (@VShastri_) February 14, 2024