ముంబై: మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబై మాజీ మేయర్ (Mumbai Former Mayor), ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం శివసేన నేత విశ్వనాథ్ మహదేశ్వర్ (Vishwanath Mahadeshwar) ఇక లేరు. ఇవాళ మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) తో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం మహదేశ్వర్ వయస్సు 63 సంవత్సరాలు.
విశ్వనాథ్ మహదేశ్వర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో మరణించారు. శాంటాక్రజ్ ఈస్ట్‌లోని రాజే శంభాజీ విద్యాలయం దగ్గర కుటుంబసభ్యులు ఆయన అంత్యక్రియలను పూర్తిచేశారు.