Jitendra Narain arrested | సామూహిక లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరేన్ అరెస్ట్ అయ్యారు. అతడిని పోర్ట్ బ్లెయిర్‌లో విచారణకు హాజరవ్వాలని సమన్లు పంపారు. విచారణకు వచ్చిన ఆయనను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది.
అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. కొంత మందితో కలిసి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో ఆయనను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది.
నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొన్నది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తున్నది. మహిళల గౌరవానికి బంగం కలిగించేలా ప్రవర్తించిన వారిని.. వారి స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటున్నట్లు నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొన్నది..