Agniveer Scheme | సెంట్రీ విధులకే అగ్నివీర్లు.. వారికిస్తున్నదీ అరకొర శిక్షణే!
అగ్నిపథ్ పథకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ భారత నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులకు అరకొర శిక్షణ ఇస్తున్నారని, వీరు సెంట్రీ విధులకు మాత్రమే సరిపోతారని అభిప్రాయపడ్డారు.
- సాంకేతికతను ఎక్కువగా వాడే ఎయిర్‌ఫోర్స్, నేవీకి సరిపడరు
- అగ్నిపథ్ పథకంతో యుద్ధ సన్నద్ధత కుంటుపడుతుంది
- సంస్కరణలకు మిలిటరీ ఏమీ ‘ల్యాబ్’ కాదు: మాజీ నేవీ చీఫ్‌లు
Agniveer Scheme | న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ భారత నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులకు అరకొర శిక్షణ ఇస్తున్నారని, వీరు సెంట్రీ విధులకు మాత్రమే సరిపోతారని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం యుద్ధ సన్నద్థతను తగ్గిస్తుందని, ఈ ప్రభావాన్ని గుర్తించకుండా అగ్నిపథ్‌ను అమలు చేయడం తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. సంస్కరణలు చేసేందుకు మిలిటరీ ఏమీ ప్రయోగశాల కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణాంతక ఆయుధాలు, సంక్లిష్టమైన యంత్రాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలంటే ముందుగా ఎవరికైనా కనీసం ఐదారేండ్లు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అగ్నివీర్లకు ఇచ్చే ఆరు నెలల శిక్షణ నేవీకి సంబంధించినంత వరకు ఏమాత్రం సరిపోదని ఆయన స్పష్టం చేశారు. పదాతిదళం ఎక్కువగా ఉండే ఆర్మీకి అగ్నివీర్లు ఉపయోగపడొచ్చని కానీ సాంకేతికతను ఎక్కువగా వినియోగించే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు వీరి ఉపయోగం తక్కువేనని అన్నారు. మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ల బిల్లు తగ్గించుకోవడం మాత్రమే అగ్నిపథ్ పథకాన్ని నడిపిస్తున్న ప్రేరణ అని పేర్కొన్నారు.
మొదట ఉన్న ప్రతిపాదన వేరే: నరవణె
ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె కూడా ప్రచురణ కావాల్సి ఉన్న తన పుస్తకంలో అగ్నివీర్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్లను కేవలం ఆర్మీలోకి మాత్రమే తీసుకోవాలని, వీరిలో 75% మందిని పూర్తిస్థాయి విధుల్లోకి తీసుకోవాలనేది ముందు ఉన్న ప్రతిపాదన అని ఆయన రాశారు. పీఎం కార్యాలయంలో ఈ పథకంలో మార్పులు జరిగాయని, ఆ తర్వాత ఒకేసారి ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనూ దీనిని అమలు చేశారన్నారు. కాగా, ఈ పుస్తకం ఏప్రిల్‌లోనే ప్రచురితం కావాల్సి ఉంది. అయితే, ఇటీవల ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుస్తకంలోని కొన్ని విషయాలను బయటకు వెల్లడించగా, అవి వివాదాస్పదం అయ్యాయి. దీంతో పుస్తకంలోని కంటెంట్‌ను ఒకసారి సమీక్షించాలని కేంద్రం నిర్ణయించడంతో పుస్తక ప్రచురణ నిలిచిపోయింది.
సైనికులు, అగ్నివీర్లకు చాలా తేడాలు
అగ్నివీర్లు, ఇతర జవాన్లకు మధ్య శిక్షణ, సర్వీసు కాలం మాత్రమే కాకుండా ఇంకొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయని అరుణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. అగ్నివీర్లు అందుకునే సౌకర్యాల్లోనూ తేడా ఉందని, వీరికి ఎలాంటి ర్యాంక్ ఉండదని తెలిపారు. ఇది సాయుధ బలగాల మధ్య ఉండాల్సిన సోదరభావం, బంధంపై ప్రభావం చూపుతుందన్నారు. మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి అందిన రూ.98 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులేనని, ఎక్స్‌గ్రేషియా కాదని స్పష్టం చేశారు. సాధారణ జవాన్ మరణిస్తే కొన్ని వారాల్లోనే ఎక్స్‌గ్రేషియా అందుతుందని, అజయ్ కుమార్ కుటుంబానికి ఆరు నెలలుగా ఎందుకు అందలేదో అర్థం కావడం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

