ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానా!
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానా! | సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా ....

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పని చేస్తున్నారు. తక్షణం ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌గా చేరాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్తానా ఏడాది పాటు ఉంటారు. ఈ నెల 31తో ఆయన సూపర్ న్యూమరేషన్ ముగుస్తుండగా.. కేంద్ర హోంశాఖ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీంతో బీఎస్ఎఫ్ డీజీగా ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ ఎస్ దేశ్వాల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గుజరాత్ క్యాడర్ అధికారి.. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. అటుపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఏజీఎంయూటీయేతర ఐపీఎస్ క్యాడర్ అధికారిని ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్‌గా నియమించడం ఇదే మొదటి సారి. ఏజీఎంయూటీ అంటే అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం అండ్ యూనియన్ టెరిటోరీ క్యాడర్ అని అర్ధం.
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్తానా.. తన సీనియర్-సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో 2018లో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో వారిని సీబీఐ నుంచి తప్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

