భువనేశ్వర్: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పడుబడిన బావిలో (Abandoned well) ఉన్న పన్నెండు అడుగుల పామును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. జిల్లాలోని ఖుంటా ప్రాంతంలో ఉపయోగంలోని లేని బావి ఉన్నది. అందులో 12 అడుగుల కింగ్ కోబ్రా (king cobra) చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దానిని బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం దానికి పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యం బాగుందని నిర్ధారించుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు.